దుమ్ముగూడెం: ముత్యాలమ్మ ఆలయ జమ ఖర్చుల వివరాలు తెలపాలి
దుమ్ముగూడెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ నిర్వహణ, జమా, ఖర్చులు వివరాలను ఆలయ కమిటీ తెలపాలని కోరుతూ గ్రామస్తులు గురువారం తహశీల్దార్ మామిడి అశోక్ కుమార్‌కు వినతి పత్రం అందించారు. ప్రస్తుతం ఆలయ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న చుక్కా గణేష్ రెడ్డి, కార్యదర్శి బైరెడ్డి సతీష్‌లు ఈ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.