తన బావమరిది ఇంట్లో జరిగిన ఫ్యామిలీ దావత్ను రేవ్ పార్టీ అంటూ ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ మధ్యే జన్వాడలో తాను ఒక ఇల్లు కట్టుకున్నాడని.. ఇండ్లల్లోకి వెళ్లినప్పుడు అందర్నీ పిలవలేదని దసరా, దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడని అని చెప్పారు. కానీ కొంతమంది దాన్ని రేవ్ పార్టీ అని సోషల్మీడియాలో ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఆ ఫ్యామిలీ దావత్లో 70 ఏళ్ల తన అత్తమ్మతో పాటు.. చిన్న పిల్లలు ఉన్నారని.. దాన్ని రేవ్ పార్టీ అని ఎలా అంటారని ప్రశ్నించారు.