రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన ఓ రైతు బిడ్డ గ్రూప్-4 ఉద్యోగం సాధించాడు. అంకుసాపూర్ గ్రామానికి చెందిన కొమురయ్య కొడుకు రాజ్ కుమార్ కు గతంలో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అయినప్పటికీ ఉద్యోగం వదులుకొని పై ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యారు. ఎస్సై ఉద్యోగం మెయిన్స్‌లో 4 మార్కులతో చేజారింది. అయినా పట్టు వదలకుండా చదివి గ్రూప్-4 ఉద్యోగం (రెవెన్యూశాఖ) జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించారు.