ఉరేసుకొని ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో జరిగింది. ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆవునురీ భాస్కర్(28) బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. అక్కడ సరైన పని దొరకకపోవడంతో తిరిగి స్వగ్రామం చేరుకొని కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర ఆలోచనకు గురై గురువారం ఉదయం తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.