'వేతనంలో కోత విధించే ప్రయత్నం విరమించుకోవాలి'

1695பார்த்தது
'వేతనంలో కోత విధించే ప్రయత్నం విరమించుకోవాలి'
సింగరేణి కార్మికుల, ఉద్యోగుల వేతనాల్లో నుండి కరోనా వైరస్ పేరుతో 50శాతం వేతనం కోతను బేషరతుగా విరమించుకోవాని ఏఐటీయూసీ నాయకులు వై.గట్టయ్య, వి.సీతారామయ్య, మేరుగు రాజయ్య డిమాండ్ చేశారు. సింగరేణిలో అధికారుల వేతనాల నుండి 60 శాతం, కార్మికుల ఉద్యోగుల వేతనాల నుండి 50 శాతం కోత విధించనున్నామని డైరెక్టర్ ఫా ద్వారా సర్క్యులర్ జారీ అయిందని వారు తెలిపారు.

సింగరేణి కార్మికులు, ఉద్యోగులు మార్చి 1 నుండి 31 తేదీ వరకు విధులు నిర్వహించిన కాలానికి ఏప్రిల్ 3న వేతన చెల్లింపు చట్టం 1936 ప్రకారం తప్పకుండా వేతనాలు చెల్లించాలని వారు సూచించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కుమ్మక్కై కోవిడ్ -19 పేరుతో వేతనాల్లో కోత విధించడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణ కాలంలో విధులను నిర్వహించిన వారికి అత్యవసర భీమా ప్రయోజనాన్ని కల్పించిందని, సింగరేణిలో శ్రమకు తగిన వేతనాన్ని ఇవ్వడం లేదని, 50 శాతం కోత విధించే ప్రయత్నాన్ని వెంటనే విరమించుకుని పూర్తి వేతనాన్ని చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி