నాణ్యమైన బొగ్గు సరఫరా చేయటమే లక్ష్యమని రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు అన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఈనెల 14 నుండి 20 వరకు నిర్వహిస్తున్న బొగ్గు నాణ్యత వారోత్సవాలను గురువారం ప్రారంభించారు. జీఎం కార్యాలయ ఆవరణలో సింగరేణి నాణ్యత పతాకాన్ని ఆవిష్కరించారు. పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు.