'లాక్ డౌన్ ను అతిక్రమిస్తే కఠిన చర్యలు'

1553பார்த்தது
'లాక్ డౌన్ ను అతిక్రమిస్తే కఠిన చర్యలు'
లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి సాయంత్రం 6 గంటల తరువాత ఎవరు బయటికి వచ్చినా ఉపేక్షించేది లేదని వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని, వారి వాహనాలను సీజ్ చేస్తామని రామగుండం కమిషనరేట్ పరిధిలోని నస్పూర్ సీఐ కృష్ణకుమార్ హెచ్చరించారు.

బుధవారం రాత్రి నస్పూర్ కోల్ బెల్ట్ లో సీఐ కృష్ణకుమార్ ద్విచక్ర వాహనంపై రోడ్డుమీద తిరుగుతున్న సుమారు 20 వాహనలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులే కాక వారి పిల్లలు కూడా యథేచ్ఛగా సాయంత్రం 6 తరువాత ఏదో ఒక పని పెట్టుకుని బయటికి రావడం చేస్తున్నారన్నారు, ఇక నుండి ఎవరు బయటకు వచ్చినా ఎవరిని వదిలే ప్రసక్తే లేదని, అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி