ఈనెల 13న గోదావరిఖని ఆర్టీసి బస్టాండ్ నుండి అరుణాచలంకు ఆర్టీసి బస్సు యాత్ర చేపట్టనున్నట్లు గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. పెద్దపల్లిలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అరుణాచలం యాత్రకు ఒకరికి రూ. 4850 ఉంటుందని, ఆర్టీసి ద్వారా చేపడుతున్న యాత్రను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అతి తక్కువ ధరలతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం యాత్ర కరపత్రాలు ఆవిష్కరించారు.