రైతుల నుంచి ఎలాంటి కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. శనివారం పెద్దపల్లి మండలం అప్పన్నపేట, అందుగులపల్లి, బ్రాహ్మణపల్లి, రాగినేడు, కనగర్తి, కాపులపల్లి, కాసులపల్లి, గోపయ్యపల్లి, పాలితం, తుర్కలమద్దికుంట, చందపల్లి, బొంపెల్లి, మేరపల్లిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ ఈర్ల స్వరూప, సింగిల్ విండో ఛైర్మన్ చింతపండు సంపత్ పాల్గొన్నారు.