రామగుండం అర్బన్ డెవలప్ మెంట్ స్థానంలో పెద్దపల్లి అర్బన్ డెవలప్ మెంట్ (పుడా) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పుడా సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లిలో బంద్ నిర్వహించారు. ఉదయం వ్యాపార, వాణిజ్య సంస్థలు కాసేపు దుకాణాలు మూసి బంద్ కు మద్దతు తెలిపారు. పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలను మూసివేయించారు. అనంతరం పుడా సాధన సమితి నాయకులు కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు.