కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర అర్ధిక పరిస్థితిని అధిగమించడానికి ఉద్యోగుల వేతనాల్లో కోత విధించబోతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికి సింగరేణిలో విధులను నిర్వహిస్తూ రోజుకు రెండు లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ దేశ,రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యమవుతున్న సింగరేణి కార్మికుల ఉద్యోగుల వేతనాల్లో కోతలు ఉండవని, ఎవరూ ఆందోళన చెందవద్దని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యదర్శి మేరుగు రాజయ్య తెలిపారు. సింగరేణి కార్మికుల, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించబోతున్నారని గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టారన్నారు. కార్మికులకు, ఉద్యోగులకు కనీస సమాచారం లేకుండా ఒక రోజు వేతనాన్ని సీఎం సహాయ నిధికి చెల్లించడం, సోషల్ డిస్టెన్స్ తో విధులను నిర్వర్తించడం, అండర్ గ్రౌండ్ బొగ్గు గనులలో బొగ్గు ఉత్పత్తి సాధ్యం కానందున లాక్ డౌన్ ప్రకటించాలన్న డిమాండ్ ను పక్కదారి పట్టించడానికి వేతన కోత ప్రచారాన్ని ముందుకు తెచ్చారని ఆయన తెలిపారు.