రామగుండం పట్టణంలోని తబితా ఆశ్రమంను బుధవారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని పిల్లలతో కొంత సేపు ఆయన ముచ్చటించి,విజయమ్మ ఫౌండేషన్ ద్వారా పదివేల రూపాయల నగదును ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ నాయక్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఉన్న తబితా ఆశ్రమానికి వెన్ను దన్నుగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రామగుండం కార్పొరేషన్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఆశ్రమంలోని పిల్లలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్, షహేదభాను, కె. మల్లేశం, కనకలక్ష్మి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.