గోదావరిఖని పారిశ్రామిక ప్రాంత పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం వన్ టౌన్ సీఐ పర్శ రమేష్ చేతుల మీదుగా సుమారు 200 మందికి ఉచిత హోమియో మందులను పంపిణీ చేశారు. అధ్యక్షులు ఎ.సుధీర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజలలో భయం తొలగించేందుకు ఫోటోగ్రాఫర్లు మంచి కార్యక్రమం తీసుకున్నారని, ‘కరోనా‘ వైరస్ నియంత్రణకు ముఖ్యంగా ప్రతి వ్యక్తి స్వీయ నియంత్రణ ముఖ్యమని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని, మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.
ఇప్పుడున్న పరిస్థితులలో ముక్కుకి మాస్క్ తప్పని సరిగా ధరించాలని, చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, అలాంటప్పుడే ఎలాంటి వైరస్ మన దరికి చేరదని, పెద్ద వయస్సు వారు ఇతరులు ఎట్టి పరిస్థితులలో బయటికి రావద్దని, ప్రభుత్వ ఆదేశాలు తప్పని సరిగా పాటించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గాలి సతీష్, మొలుగూరి వెంకటేష్ గౌడ్, దబ్బెట శంకర్, పుప్పాల కుమార్, శీలం శ్రీనివాస్, గడ్డి మల్లేష్, సమ్మయ్య, మంద రవికుమార్, సన్నీ శ్రీను, పల్లెర్ల జగన్, చందు, సందీప్, సహాదేవ్, రమణ, డాక్టర్ జి. రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.