గోదావరి ఖని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పనిచేస్తున్న 25 మంది వలస కూలీలకు బుధవారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారోనా వ్యాధి నేపద్యంలో రాష్ట్రంలో ఉండిపోయిన ఇతర రాష్ట్రాల కులీలకు, కార్మికులకు దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించనీ విధంగా వారికి అర్ధిక భరోస కల్పిస్తూ ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం, 500 రూపాయల నగదు అందించి సీఎం కేసీఆర్ దేశ ప్రజలలో మనసున్న మహరాజుగా కీర్తించబడుతున్నరని అన్నారు.
వలస కులీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ విపత్కకర పరిస్థితుల్లో వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించి వారి అకలిని తీర్చుతుందని అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని వలస కులీలకు అండగా నిలుస్తామని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపద్యంలో కార్మికులకు తగిన రక్షణ చర్యలు సంబంధిత కాంట్రాక్టర్లు తీసుకోవాలని సూచించారు. కార్మికులు ప్రభుత్వం సూచించిన విధంగా సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, తహశీల్దార్ సుధాకర్, ఆసుపత్రి సూపరిడెంట్ శ్రీనివాసరెడ్డి, వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.