మానవత్వం చాటుకున్న రామగిరి ఎస్ఐ

1668பார்த்தது
మానవత్వం చాటుకున్న రామగిరి ఎస్ఐ
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో పనులు లేక సిద్దిపేట నుండి మహారాష్ట్రలోని సిరొంచకు కాలినడకన వెళ్తున్న వలస కార్మికుల ఆకలి తీర్చి రామగిరి ఎస్ఐ అర్కటి మహేందర్ తన మానవతను చాటుకున్నారు. ఆకలితో అలిసిపోయి ఉన్న వలస కార్మికులను పెట్రోలింగ్ చేస్తున్న రామగిరి ఎస్ఐ అర్కటి మహేందర్ వారి వివరాలు తెలుసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి వారికి కావాల్సిన భోజనం, మంచినీళ్ల బాటిల్స్ అందించి వారి ఆకలి తీర్చారు. అలాగే వారు ఎక్కడికి వెళ్లాలో తెలుసుకొని వారికి వాహనాలు ఏర్పాటు చేసి 10 మందిని భద్రంగా పంపించారు. ఈ కార్యక్రమంలో ఏఎసై రమేష్, కానిస్టేబుల్ వేణు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி