కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామపంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులకు సమాచారం ఇవ్వకుండా విధులకు గైరాజరైన కార్యదర్శికి పలుమార్లు మెమోలు కూడా జారీ చేశారు. ఈ నెల 26 వరకు విధులకు హాజరుకావాలని చివరి అవకాశం ఇచ్చినా విధుల్లో చేరక పోవడంతో సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఉత్తర్వులో పేర్కొన్నారు.