ఇల్లంతకుంట: మూడు కుటుంబాలకు 50 కిలోల బియ్యం వితరణ
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కందికట్కూర్, రహీంఖాన్ పేట, ఇల్లంతకుంట, ముస్కాన్ పేట గ్రామాలలో ఆకస్మికంగా మరణించిన వారి కుటుంబాలను బెంద్రం తిరుపతి రెడ్డి శనివారం పరామర్శించారు. ఆ కుటుంబాల వారందరికి 50 కిలోల చొప్పున బియ్యం వితరణ చేశారు. ఈ సహాయ సేవాలలో ఫౌండేషన్ సేవా ప్రతినిధులు భూమల్ల ప్రశాంత్, జంగిటి అజయ్, ఇట్టిరెడ్డి లక్ష్మారెడ్డి, గడ్డిల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.