అక్రమ కట్టడాలను తొలగించాలి: కోరుట్ల బీజేపీ కౌన్సిలర్
కోరుట్ల పట్టణంలో నేషనల్ హైవే నెంబర్ 63 ని ఆనుకొని అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని, వాటిని వెంటనే తొలగించే ఏర్పాటు చేయాలని కోరుతూ కోరుట్ల మున్సిపల్ కమిషనర్ కు గురువారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎలాంటి లేఔట్ లేకుండా ఇట్టి నిర్మాణాలు కొనసాగిస్తున్నారని 1362, 1963 సర్వే నెంబర్లలో అక్రమంగా రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని కౌన్సిలర్ పెండిం గణేష్ ఫిర్యాదు చేశారు.