రాయికల్ మండలంలోని మహితపూర్ అంగన్వాడీ సెంటర్ ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా పిల్లలకు సంబంధించిన రిజిస్టర్ నమోదు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. 3-6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఎంతమంది ఉన్నారు, రోజు వారికి ఇచ్చే ఆహార మెనూను, వయస్సుకు తగ్గట్టుగా పొడవు, బరువు ఉన్నారా అని తెలుసుకున్నారు. అనంతరం మహితపూర్ గ్రామంలో నర్సరీని సందర్శించారు.