జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్ లో తన పొలానికి విద్యుత్ కంచె అమర్చి ఈ నెల 18 న జెల్ల పెద్ద ముత్తన్న మృతికి కారణమైన గొండ సాయన్నను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో వివరాలు వెల్లడించారు. నిందితుడు మక్క చేను చుట్టూ ఉన్న ఫెన్సింగ్ కు విద్యుత్ ప్రసారం చేయగా దీనికి తగిలి రైతు మృతి చెందాడన్నారు.