జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని జెడ్పి హై స్కూల్ లో గురువారం విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనం దుర్వాసన వేయడంతో విద్యార్థులు భోజనం చేయకుండా ఇండ్లకు వెళ్లిపోయారు. వండిన పప్పు నురుగుతో చేదుగా ఉండటంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని వంటను పరిశీలించి పప్పులో మోతాదును మించి పాలకూర వేయడంతో ఫెస్టిసైడ్ వాసన వస్తున్నట్టు గుర్తించారు.