కొండగట్టులో వానరులకు పండ్ల వితరణ

2086பார்த்தது
కొండగట్టులో వానరులకు పండ్ల వితరణ
లాక్ డౌన్ కారణంగా కొండగట్టులోని ఆంజనేయస్వామి దేవలయం మూసివేయటంతో అక్కడున్నటువంటి కోతులకు ఆహరం లేక అల్లడిపోతున్నాయి. కావున బుధవారం రామడుగు మండలం పందికుంటపల్లి గ్రామం నుండి సర్పంచ్ కటుకం రవీందర్ ఆధ్వర్యంలో 200 డజన్ల ఆరటిపండ్లు, 4 బస్తల బోల్ ప్యాలలు, 150 కొబ్బరికాయలు, 10 క్వింటాళ్ల బియ్యం, 20 కీలోల పుట్నాలు, 3 క్వింటాళ్లు టామాటలు, త్రాగునీరు, కొండగట్టులోని వానరులకు తీసుకోని వేళ్లటం జరిగింది.

కొండగట్టు గుట్ట మీద ఉన్నటువంటి బీదా పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేయుటకు సహకరించిన యువతకి గ్రామ ప్రజలకు మరియు దాతలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి సర్పంచ్ కటుకం రవీందర్ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ యువత, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி