ఈ నెల 19వ తేదీన జరిగే జిల్లా సీపీఎం మూడో మహాసభలను విజయవంతం చేయాలని బోయినపల్లి మండల కేంద్రంలో హమాలి కార్మికుల ఆధ్వర్యంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించారు అనంతరం సీపీఎం కన్వీనర్ గురజాల శ్రీధర్ మాట్లాడుతూ నవంబర్ 19న ఉదయం 10 గంటల వరకు సిరిసిల్ల ఆర్డిఓ కార్యాలయానికి అన్ని రంగాల కార్మికులు చేరుకొని ఊరేగింపును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.