ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో టపాకాయలకు డిమాండ్ పెరగడంతో, ధరలు అమాంతం కొండెక్కాయి. అయిన దీపావళికి టపాకాయలు కాల్చక తప్పదు కాబట్టి ధర ఎంతైనా కొనక తప్పలేదు. గతంలో కన్నా ఎల్లారెడ్డిలో ఈ దీపావళికి దుకాణాల సంఖ్య గతంలో కన్నా రెట్టింపు అయింది. స్థానిక రామాలయం ఆవరణలో టపాకుల దుకాణాలకు లైసెన్సులు ఇచ్చి నంబర్లు కేటాయించి, అన్ని జాగ్రతలతో దుకాణాలు వెలిశాయి. ఖాళీ స్థలంలో ఈ దుకాణాలు మరో రెండు రోజులు ఉంటాయి.