తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఎల్లారెడ్డి మండలంలోని 31 గ్రామ పంచాయతీల పరిధిలో, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోని 12 వార్డుల పరిధిలో ప్రారంభమై కొనసాగుతోందని ఎంపీడీఓ అతినారపు ప్రకాష్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తెలిపారు. గురువారం 6వ రోజున ఎన్యూమరేటర్లు ఎవరికి కేటాయించిన బ్లాకులో వారు కుటుంబ వివరాల నమోదును వేగవంతం చేస్తున్నారు.