జుక్కల్ మండలం హంగర్గ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరారు. ఎమ్మెల్యే వీరందరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా రంజక పాలన, అభివృద్ధి కోసం ఎమ్యెల్యే నిర్విరామంగా చేస్తున్న కృషి, తీరుపట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు.