కర్ణాటకలోని ఔరద్ పట్టణం నుండి బిచ్కుంద పట్టణానికి ట్రాలీ ఆటోలో డ్రైవర్ బుర్రివారి సంతోష్ నిషేధిత గుట్కా తరలిస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు గోపనపల్లి శివారులో గురువారం బిచ్కుంద పోలీసులు పట్టుకున్నారు. ఇట్టి ట్రాలీఆటో నిండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించబడిన గుట్కాకు సంబంధించిన పదార్థాలు సంచులు నింపబడి ఉన్నందున గుట్కాతో కూడిన ఆటోని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ. మోహన్ రెడ్డి తెలిపారు.