బాన్సువాడ: దేశాయిపేట గ్రామంలో ట్రాక్టర్ల ఊరేగింపు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామంలో ఆదివారం ట్రాక్టర్లను ముస్తాబు చేసి గ్రామంలో హనుమాన్ మందిర్ నుండి బారెడు పోచమ్మ వరకు తిప్పారు. ప్రతి సంవత్సరం తమ గ్రామంలో ఎడ్ల బండ్లను తిప్పేవారు. ఎడ్ల పండ్లు లేకపోవడంతో ఈ సంవత్సరం ట్రాక్టర్లను ముస్తాబు చేసి గ్రామంలో ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మునేకర్ ప్రకాష్, విక్రమ్ రావు, మాజీ ఎంపిటిసి వెంకటరమణ, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.