పాత బాన్సువాడ దళితవాడకు చెందిన పలువురు మహిళలు తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ బుధవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు మాట్లాడుతూ 1983లో కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో తమకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చారని, డబుల్ బెడ్ రూమ్ అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఇండ్లను ఖాళీ చేయించి, అద్దె ఇళ్లలో ఉండేలా చేసిందన్నారు.