నందిపేట మండలం ఐలాపూర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం కళాశాల ఎన్. ఎస్. ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్. ఎస్. ఎస్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ. పూలను పూజిస్తూ, మహిళలు పాడే బతుకమ్మ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి లాంటివి కనబడతాయని అన్నారు.