అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (60) లేటు వయసులో మళ్లీ పెళ్లికి రెడీ అయ్యాడు. ప్రియురాలు లారెన్ శాంచెజ్ (54)ను త్వరలోనే వివాహం చేసుకోనున్నాడు. తన మొదటి భార్య మెకంజీ స్కాట్తో 2019లో డైవర్స్ తీసుకోగా అప్పటి నుంచి లారెన్తో డేటింగ్లో ఉన్నట్లు సమాచారం. గతేడాది మే నెలలో వీరు నిశ్చితార్థం జరగగా 2.5 మిలియన్ డాలర్ల వజ్రాల ఉంగరం ఇచ్చి ప్రియురాలికి ప్రపోజ్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.