జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన జక్కాపురం సత్తెమ్మ ఇటీవల మృతి చెందారు. మృతురాలు 98 సంవత్సరాల కాలం జీవించిందని కుటుంబీకులు తెలిపారు. మనుషుల్లో కొందరు సుదీర్ఘ కాలం పాటు ఆరోగ్యంగా జీవించడానికి జన్యువు ప్రభావం, మంచి వాతావరణంలో జీవించడం, మంచి ఆహారం తీసుకోవడం, చింతలు లేని జీవన గమనం గడపటం వల్ల సుదీర్ఘ కాలం జీవించడానికి దోహదపడతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.