జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిశెలపేట గ్రామంలో బుధవారం పౌరహక్కుల దినోత్సవ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ఎండపల్లి తహశీల్దార్ కడార్ల రవికాంత్ తెలిపారు. కాగా మండల, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు, 16 శాఖల అధికారులు గొడిశెలపేట గ్రామంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారి పట్ల అంటరానితనం నిర్మూలణ, నివారణకై జరుగు గ్రామ సభకు హాజరు కావాలని తహశీల్దార్ రవికాంత్ కోరారు.