మధ్యప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన నాచారం వాసుల బంధువులను మంగళవారం కలసి మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పల్ మాజీ శాసన సభ్యులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చొరవతో కేంద్ర మంత్రుల సహాయ సహకారాలతో మరణించినవారి మృతదేహాలను బుధవారం వచ్చే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలియచేసారు.