కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో క్రీడలు అనాథగా మిగిలిపోయాయని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్ ఆధ్వర్యంలో ఓయూలో నిర్వహించనున్న కేసీఆర్ కప్ 2025 ను ముఖ్య అతిథిగా విచ్చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగం కుదేలవుతుందని మండిపడ్డారు.