ఎస్సీ వర్గీకరణ విషయంలో షమీమ్ అక్తర్ రిపోర్టుని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి వర్గీకరణ చేస్తున్నామని చెప్పినటువంటి తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మంగళవారం మాల యూత్ ఫెడరేషన్ ఛైర్మన్ మందాల భాస్కర్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలంగాణ మాల స్టూడెంట్ జేఏసీ, మాల ఫెడరేషన్ నాయకులు ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.