భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ఉప్పల్ నియోజకవర్గం సభ్యులతో మణికంఠ అధ్యక్షతన ఉప్పల్ లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మలోత్ రాజేష్ నాయక్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయని, ప్రభుత్వం యొక్క ఆదేశాలను పట్టించుకోకుండా బుక్స్ ను ఇష్టానుసారం అమ్ముతున్నారని ఆరోపించారు.