కవాడిగూడ డివిజన్, లోయర్ ట్యాంకుబండ్, దోబి ఘాట్‌లో కమ్యూనిటీ హల్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్‌తో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పార్టీలకతీతంగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర మంత్రి అధికారులకు సూచించారు.