మౌలిక సదుపాయాల నిర్వహణ పనుల కారణంగా సికింద్రాబాద్-మేడ్చల్ మార్గంలో పలు సబర్బన్ రైళ్లను నెలరోజుల పాటు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అక్టోబరు1 నుంచి 31 వరకు సికింద్రాబాద్-మేడ్చల్ మార్గంలో 8, లింగంపల్లి- మేడ్చల్ మార్గంలో 2, కాచిగూడ నిజామాబాద్ మార్గంలో మరో 2 సర్వీసులను నిలిపి వేస్తున్నట్లు సీపీఆర్ శ్రీధర్ శుక్రవారం తెలిపారు. కాచిగూడ-మెదక్ మార్గంలో నడిచే రైలును పాక్షికంగా రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.