సికింద్రాబాద్: ఒంటరిగా వచ్చి కేటీఆర్ ను కలిసిన విద్యార్థిని

78பார்த்தது
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసేందుకు 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని రోషిణి గురువారం తెలంగాణ భవన్ కు ఒంటరిగా వెళ్ళింది. నేరుగా కేటీఆర్ ఛాంబర్ కు వెళ్లి ఆయనతో ముచ్చటించింది. ఎవరెవరు వచ్చారని కేటీఆర్ అడగగా ఒంటరిగా వచ్చానని చెప్పడంతో కేటీఆర్ అవక్కై బాలికను హత్తుకున్నారు. చదువు, నివాసం, తల్లిదండ్రుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అమే ధైర్యానికి మెచ్చుకుని బాలికకు జ్ఞాపికను బహుకరించారు.

தொடர்புடைய செய்தி