అన్నదమ్ములు మాదకద్రవ్యాల విక్రయంతో సులువుగా డబ్బులు సంపాదించాలని గంజాయి వ్యాపారాన్ని ఎంచుకున్నారు. రైళ్ల ద్వారా తరలిస్తూ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. షాలిమార్ నుంచి ముంబయి తరలిస్తున్న రూ. 4. 50 లక్షల విలువైన 18 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని జీఆర్పి పోలీసులు రిమాండ్ కు తరలించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం, హుబ్లీ వాసులుగా ప్రీతమ్ చౌధురి (37), సత్యం చౌధురి (29) అన్నదమ్ములు.