సీతాఫలమండి లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్ద మంగళవారం ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ సిటీలో కొత్తగా ప్రవేశించిన ఈ బైక్ను ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణకు మోటార్ వాహనాల వాడకంలో విప్లవాత్మక మార్పులు అవసరమని, సమకాలీన పరిస్థితుల్లో ఎలక్ట్రిక్, బ్యాటరీ ఛార్జింగ్ వాహనాలకు ప్రాముఖ్యత ఉందన్నారు. వాయు, శబ్ద కాలుష్య రహిత వాహనాల వాడకం వల్ల ప్రయోజనాలు ఉంటాయన్నారు. కార్పొరేటర్ సామల హేమ పాల్గొన్నారు.