బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది గృహ ప్రవేశం కార్యక్రమంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని
సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలుసతమతం అవుతున్నారు. వాటిపై దృష్టి సారించాలని తలసాని అన్నారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ తప్పిదాలు, ఎన్నికల హామీలపై కేటీఆర్ ప్రశ్నిస్తున్న కారణంగానే కుట్రపూరితంగా కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.