కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం డివిజన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పదవ తరగతి విద్యార్థుల పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి మంగళవారం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు నోట్ బుక్ పుస్తకాల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు.