నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని యాప్రాలోని శ్మశానవాటికను అభివృద్ధి చేయాలని నేరేడ్మెట్ గౌడ సంఘం నాయకులు శుక్రవారం కోరారు. ఈ మేరకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి, నరసింహ, మురళి, రాజేష్, చందర్, తదితరులు పాల్గొన్నారు.