మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని రామంజనేయ నగర్ లో 22 లక్షలు వ్యయంతో జరగనున్న ఆర్ సి సి పైప్ లైన్ పనులను శనివారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, అడ్డగుట్ట కార్పోరేటర్ లింగాని ప్రసన్న శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.