మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బుధవారం కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు వినతిపత్రాలు అందజేశారు. మల్కాజ్ గిరి పార్లమెంటు పరిధిలో పలు రైల్వే అండర్ పాస్, ఓవర్ బ్రిడ్జి పనుల కోసం మద్దతు కోరారు. హుజూరాబాద్ లో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, జర్నలిస్టుల పాసులను పునరుద్ధరించాలని కోరారు.