సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి నేరేడ్ మేట్ డివిజన్ కు చెందిన రాజ్ కిరణ్, విఘ్నేష్ గౌడ్ కు మంజూరైన చెక్కులను మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అందజేశారు. శుక్రవారం మల్కాజ్ గిరిలోని తన క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.