ఎల్బీనగర్: కాలనీలను పరిశుభ్రంగా ఉంచాలి
కాలనీల్లో చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవనకుమార్ సూచించారు. మోహన్ నగర్ లోని ఎస్ బీహెచ్ కాలనీలో చెత్త కుప్పలు పేరుకుపోయాయని స్థానికుల ఫిర్యాదు మేరకు సోమవారం ఆయన పర్యటించి శానిటైజేషన్, రాంకీ సూపర్వైజర్లను పిలిపించి చెత్తను తరలించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాలనీ వాసులకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పడు చెత్తను తరలించాలన్నారు.