బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్ లోని సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి గురువారం పరిశీలించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా మహ్మద్ నయీం కుటుంబానికి సంబంధించిన వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశేట్టి, అడిషనల్ కమిషనర్ స్నేహ పాల్గొన్నారు.